‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ మన తెలుగు ఆడియన్స్ పల్స్ కూడా పట్టేసాడు..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ అదే ‘కె.జి.ఎఫ్’ చిత్రం.. ఇండియా వైడ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ హీరో గురించి కానీ.. డైరెక్టర్ గురించి కానీ.. ఆ చిత్రం విడుదలయ్యే ముందు వరకూ ఎవ్వరికీ తెలీదు. కానీ ‘బాహుబలి’ తరువాత బాలీవుడ్ లో సైతం మన సౌత్ సినిమా గురించి మాట్లాడేలా చేసింది ఆ చిత్రం. హీరో యష్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ .. పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిపోయారు. ఇక వీరిద్దరూ కలిసి ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. కె.జి.ఎఫ్ సినిమాలో హీరో ని సరికొత్త మాస్ యాంగిల్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్… ఎలా చూపించాడా అనే డౌట్ అందరికీ వస్తుంది. అంత క్యాచీగా డైలాగ్స్ రాసుకుని .. హీరోని ఆ రేంజ్లో ఎలివేట్ చేయడంలో అతని ప్రధాన బలం ఏంటో తాజాగా అతను పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల గురించి అతను మాట్లాడిన విధానాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ క్రేజ్ మరే హీరోకి సాధ్యం కానిది. ఇక నటనలో ఎన్టీఆర్ ని కొట్టేవాళ్ళు లేరు. మెగాస్టార్ నెక్స్ట్ సినిమా కోసం నేను కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. రాజమౌళి మిగిలిన దర్శకులందరికీ కొత్త మార్గం చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్” అంటూ టాలివుడ్లో ఉన్న ప్రధాన బలాల గురించి తెలిసేసుకున్నాడు…ఈ డైరెక్టర్. సో టాలివుడ్ ప్రేక్షకుల పల్స్ ను కూడా ఈయన పట్టేసాడని చెప్పొచ్చు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus