Prabhas: ఎప్పటి నుండో వచ్చిన పుకారు ఇప్పుడు నిజమట!

  • June 30, 2022 / 11:41 AM IST

సీక్వెల్స్‌, సిరీస్‌లు ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఏలుతున్నాయి అని చెప్పొచ్చు. ఓ సినిమా మంచి విజయం అందుకోవడం ఆలస్యం దీనికి సీక్వెల్‌ ఉందా? సిరీస్‌ చేస్తారా? ఫ్రాంచైజీ చేసేయొచ్చు కదా అని రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా గత కొద్ది రోజుల క్రితం వరకే. ఇప్పుడు సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. ‘విక్రమ్‌’ సినిమా వచ్చాక ఇది ఇంకా ఎక్కువైంది. లోకేశ్‌ కనగరాజ్‌ మల్టీవర్స్‌, సినిమాటిక్‌ యూనివర్స్‌ అని అన్నారు. అంతకుముందు వినిపించింది ప్రశాంత్‌ నీల్‌ మల్టీవర్స్‌.

అప్పుడు వినిపించి మల్టీవర్స్‌ / సినిమాటిక్‌ యూనివర్స్‌ నిజమే అని లేటెస్ట్‌ టాక్‌ వినిపిస్తోంది. గతంలో వచ్చిన పుకార్లకు తగ్గట్టుగా అంటే ‘కేజీయఫ్‌ 2’ నుండి ‘సలార్‌’ సినిమా పుట్టికొస్తోంది అని చెబుతున్నారు. ‘కేజీయఫ్‌ 2’లో ఉన్న ఓ పాత్రనే ఇప్పుడు ‘సలార్‌’లో హీరో అవుతుంది అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే వీటి మీద అప్పుడు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రశాంత్‌ నీల్‌కి అలాంటి ఆలోచన లేదేమో అనుకున్నారు. కానీ ఆ ఆలోచన అమలు చేశారని లేటెస్ట్‌ టాక్‌.

‘సలార్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అందులో భాగంగా ‘కేజీయఫ్‌ 2’కి ‘సలార్‌’కి ఉన్న సంబంధం గురించి కొన్ని సీన్స్‌ తీస్తున్నారని, తీశారని.. ఇంకొన్ని తీస్తారని టాక్‌ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ అద్భుతంగా ఈ రెండు చిత్రాలకు లింక్ కుదిర్చాడని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ‘కేజీయఫ్‌’ ఫ్యాన్స్‌కి, ‘సలార్‌’ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి. ఎందుకంటే రెండు పవర్‌ హౌస్‌లు లాంటి పాత్రలు కలవడం చాలా పెద్ద విషయం.

ఈ మేరకు ‘సలార్‌’ సినిమాలో ఓ సీన్‌లో యశ్‌ కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ సీన్‌తోనే రెండు సినిమాలకు లింక్‌ పెడతారని చెబుతున్నారు. దీనికి సంబంధించి బిల్డప్‌ సీన్‌ ‘కేజీయఫ్ 2’లో హింట్‌గా ఇచ్చారు అని చెబుతున్నారు. లేదంటే అప్పుడు షూట్‌ చేసి ఇప్పుడు ఈ సినిమాలో వాడుకునే అవకాశమూ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ మైండ్‌లో ఏం రన్‌ అయ్యిందో, అవుతుందో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus