Yash, Vijay: తమిళ్ లో ‘బీస్ట్’ ను చిత్తు చిత్తు చేసిన ‘కె.జి.ఎఫ్ 2’..!

  • April 22, 2022 / 07:51 PM IST

2016 లో భారీ అంచనాల నడుమ విడుదలై పరాజయం పాలైంది మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మూవీ. ఈ సినిమాని సీరియల్ తో పోలుస్తూ యాంటీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీకి కొద్దిరోజుల ముందు విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’ ఎవ్వరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించింది. సీడెడ్ వంటి కొన్ని చోట్ల ‘బ్రహ్మోత్సవం’ మూవీ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.

Click Here To Watch NOW

రూ.60 కోట్ల బడ్జెట్ మూవీ రూ.1 కోటి రూపాయల బడ్జెట్ మూవీ డామినేట్ చేయడం ఆ టైములో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు తమిళ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది అంటున్నారు కొంతమంది నెటిజన్లు. విషయంలోకి వెళ్తే.. గత వారం ‘కె.జి.ఎఫ్2’ ‘బీస్ట్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ ‘కె.జి.ఎఫ్ 2’ కంటే ఒకరోజు ముందు రిలీజ్ అయ్యింది. నిజానికి ‘బీస్ట్’ పక్కన ‘కె.జి.ఎఫ్ 2’ కనీసం నిలబడలేదు అని అక్కడి విజయ్ అభిమానులు కామెంట్లు చేశారు.

అంతేకాదు ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ను లాటరీ హిట్ అంటూ వాళ్ళు విమర్శించారు. కానీ కట్ చేస్తే ‘బీస్ట్’ మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. ‘బీస్ట్’ మూవీ తమిళ్ లో 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.61.17 కోట్లు కలెక్ట్ చేయగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ 8 రోజులకే అక్కడ రూ.64.04 కోట్లు కొల్లగొట్టింది. నిన్నటి రోజున అక్కడ ‘బీస్ట్’ మూవీ రూ.1.04 కోట్లను కలెక్ట్ చేయగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ రూ.4.20 కోట్లను కలెక్ట్ చేసింది.

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కంటే కూడా ‘బీస్ట్’ కు ఎక్కువ బడ్జెట్ పెట్టారట. విజయ్ మార్కెట్ ముందు ‘కె.జి.ఎఫ్ 2’ చిత్తు చిత్తు అవుతుంది అనుకుంటే సీన్ రిపీట్ అయినట్టు తెలుస్తుంది. తమిళ్ లో నిన్న ‘కె.జి.ఎఫ్2’ కి ఇంకో 200 థియేటర్లు అదనంగా దక్కాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus