KGF2: కేజీఎఫ్2 డైరెక్టర్ కంటే హీరో రెమ్యునరేషన్ ఎక్కువా?

ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో కేజీఎఫ్ ఛాప్టర్2 ఒకటనే సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఆ అంచనాలను మించి విజయాన్ని సాధించడంతో పాటు తొలి వారం 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేజీఎఫ్2 సినిమా 280 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. ఫుల్ రన్ లో ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Click Here To Watch NOW

కేజీఎఫ్2 హీరో యశ్ కు ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా దక్కిందని తెలుస్తోంది. యశ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని బోగట్టా. తన టాలెంట్ తో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

ఈ సినిమా సక్సెస్ లో అధీర పాత్ర కూడా కీలకమనే సంగతి తెలిసిందే. అధీర పాత్రను సంజయ్ దత్ పోషించగా సంజయ్ దత్ ఈ పాత్ర కొరకు 10 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కగా రవీన టాండన్ 2 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమా కోసం 80 నుంచి 85 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.

ప్రశాంత్ నీల్ కు మాత్రం మరింత ఎక్కువ మొత్తం పారితోషికంగా దక్కి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ నీల్ తర్వాత మూవీ కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కనుంది. సలార్ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus