KGF2: ‘కె.జి.ఎఫ్ 2’ హిందీలో మరో రికార్డు కొట్టిందిగా..!

  • April 25, 2022 / 02:36 PM IST

యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ తర్వాత ఇటీవల వచ్చిన ‘కె.జి.ఎఫ్ 2’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘హోంబలే ఫిల్మ్స్’ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ కన్నడ డబ్బింగ్ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. యష్ మాస్ పెర్ఫార్మన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్, రవి బస్రూర్ సంగీతం ప్రేక్షకుల్ని రిపీటెడ్ గా థియేటర్లకు రప్పిస్తుండడం విశేషం.

Click Here To Watch NOW

అన్ని భాషల్లోనూ ఈ మూవీ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది. ఆల్రెడీ 900 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసిన ఈ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో కూడా ఈ మూవీ అన్-స్టాపబుల్ అన్నట్టు దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ అక్కడ రూ.300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి సంచలనం సృష్టించింది. నిన్నటితో అంటే ‘కె.జి.ఎఫ్ 2’ విడుదలైన 11వ రోజుతో ఈ ఫీట్ ను సాధించింది.

మొత్తం 11 రోజులకు గాను అక్కడ రూ.321.12 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది ‘కె.జి.ఎఫ్ 2’.సౌత్ మూవీస్ లో ‘బాహుబలి 2’ తర్వాతి స్థానంలో ‘కె.జి.ఎఫ్ 2′ నిలిచింది.’బాహుబలి 2’ అక్కడ రూ.510 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా నడుస్తోంది అని ‘కె.జి.ఎఫ్ 2′ మరోసారి స్పష్టం చేసింది.’పుష్ప :ది రైజ్’ అక్కడ రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది.

రామ్ చరణ్- ఎన్టీఆర్ ల ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కూడా 31 రోజులకు గాను అక్కడ రూ.265.17 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. వాటిని అధిగమించి ‘కె.జి.ఎఫ్ 2’ ఈ ఫీట్ ను సాధించింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus