నిజ జీవితంలో న్యాయస్థానంలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకుపుట్టే వాళ్ళు కూడా సినిమాల్లో కోర్టు సన్నివేశాలు అనగానే చెవులు నిక్కబొడుచుకుని మరీ వింటున్నారు. ఈ మధ్యకాలంలో వీటి మీద మరింత ఆసక్తి పెరిగిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్ కోర్ట్ సీన్ లో ఉతికారేశాడు. అన్న కళ్యాణ్ కూడా అదే ప్రయత్నం చేయబోయి ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు చిరంజీవి సినిమాలోనే కోర్ట్ సీనే కీలక ఘట్టం అంటున్నారు ‘ఖైదీ నెం 150’ చిత్రబృందం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖైదీ నెం 150’. రామ్ చరణ్ లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కోర్ట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశం సినిమాకే వన్నె తెస్తుందట. రైతు సమస్యలపై ఓ ఖైదీ చేసే పోరాటమే ఈ సినిమా. ఇటువంటి సామజిక ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమాలో వచ్చే కోర్ట్ సన్నివేశానికి రచయితలు పరచూరి, సాయి మాధవ్ పదునైన సంభాషణలు సిద్ధం చేశారట. ‘లంచగొండితనం’ కథతో తెరకెక్కిన ‘ఠాగూర్’ క్లైమాక్స్ లో కోర్ట్ సన్నివేశానికి ఎంతటి స్పందన వచ్చిందో తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ కానుందన్నమాట. ఇక్కడ ఓ విషయం గమనిస్తే.. అదీ మురుగదాస్ సినిమాకి రీమేకే – ఇదే మురుగదాస్ సినిమానే. అక్కడా చిరు – వినాయక్ కాగా ఇక్కడా అదే కాంబినేషన్. ఎన్ని సారోప్యతలో కదూ. మరి సినిమా కూడా ఆ స్థాయి హిట్ సాధిస్తుందంటారా..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.