ఖైదీ నంబర్ 150 ఆడియో రిలీజ్ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు
- December 2, 2016 / 12:20 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఖైదీ నంబర్ 150 మూవీ నిన్నటితో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నేటి నుంచి రామోజీ ఫిలింసిటీలో శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చివరి పాటను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ లో చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారు. దీని తర్వాత ఆడియో రిలీజ్ వేడుకపై దృష్టి పెట్టనున్నారు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్.
అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమం లో కొత్త టెక్నాలజీని పరిచయం చేయనున్నారు. ఆరోజు విడుదల కానున్న పాటలు, టీజర్లకు #డీ హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇది వరకు ఏ తెలుగు చిత్రానికి ఈ పరిజ్ఞానాన్ని వినియోగించలేదాని స్పష్టం చేసింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాస్ అభిమానులను ఉర్రూతలూగిస్తాయని వివరించింది. భారీ అంచనాలతో ఖైదీ నంబర్ 150 మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















