పాటలకోసం విదేశాలకు వెళ్లిన ఖైదీ నంబర్ 150 బృందం

మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చారు. స్టెప్పులు వేయడానికి సిద్ధమయ్యారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఖైదీ నంబర్ 150 షూటింగ్ వేగంగా జరుగుతోంది. రెండు రోజుల క్రితం కన్నల్ కనన్ ఆధ్వర్యంలో క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ ని పూర్తి చేసిన చిత్ర బృందం నేడు యూరప్ లో ల్యాండ్ అయింది. అక్కడ స్లోవేనియా, క్రోయాటియా దేశాల్లోని అందమైన ప్రాంతాల్లో రెండు పాటలను షూటింగ్ చేయనున్నారు.

ఈ పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనునున్నారు. ఇందుకోసం చిరు, కాజల్, జానీ మాస్టర్ టెక్నీకల్ సిబ్బందితో పాటు స్టైలిష్ సుష్మిత తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఆ విషయాన్నీ చిత్ర పీఆర్ ఓ వెల్లడించారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=UknGRNz4g5Q

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus