ఖరారైన “ఖైదీ” ప్రీ రిలీజ్ వేడుక డేట్
- December 24, 2016 / 01:24 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరు నటించిన `ఖైదీనంబర్ 150` మూవీ ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఫిక్స్ అయింది. చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్ క్రిస్మస్, కొత్తసంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫంక్షన్ డేట్ ని ప్రకటించారు. జనవరి 4న విజయవాడలో `ఖైదీనంబర్ 150` ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అంతేకాకుండా సినిమాలోని “సుందరి” అనే పాటను కూడా రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన `అమ్మడు లెట్స్ డు కుమ్ముడు` ఆడియో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాస్ కోసం రాసి, పాడిన ఈ పాట అందరికీ తెగ నచ్చింది. సాంగ్ మేకింగ్ వీడియోకి కూడా మంచి స్పందన వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తుండడంతో ఆయనకు ఘనంగా వెల్కమ్ చెప్పడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఎత్తున తరలి వెళ్లి హంగామా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















