మెగాస్టార్ చిరంజీవి అడుగుపెడితే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయమని ఆయన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ నిరూపించింది. పదేళ్ల తర్వాత చిరు హీరోగా నటించిన ఈ సినిమా కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన మెగాస్టార్ 150 వ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి మెగా పవర్ చూపించింది. తొలి వారానికే 108. 48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ మూవీ షేర్ వందకోట్లు సాధించే దిశగా దూసుకు పోతోంది. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ అయినందుకు రేపు (28న) హైదరాబాద్ లో సక్సస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150 రెండు వారాల కలక్షన్స్(షేర్) ప్రాంతాల వారీగా ఇలా ఉన్నాయి.
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 17.81
సీడెడ్ 13.48
నెల్లూరు 3.05
కృష్ణ 5.13
గుంటూరు 6.60
వైజాగ్ 11.59
ఈస్ట్ గోదావరి 7.53
వెస్ట్ గోదావరి 5.61
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ 70.80
కర్ణాటక 8.80
ఇతర రాష్ట్రాల్లో 1.95
ఓవర్సీస్ 13.60
ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ 95.15
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.