మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. గత వారం అంటే ఫిబ్రవరి 11న విడుదలై ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ మొదటి వారం పర్వాలేదు అనిపించినప్పటికీ రెండో వీకెండ్ కు చేతులెత్తేసింది.
ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 3.92 cr |
సీడెడ్ | 1.79 cr |
ఉత్తరాంధ్ర | 1.54 cr |
ఈస్ట్ | 0.81 cr |
వెస్ట్ | 0.65 cr |
గుంటూరు | 1.08 cr |
కృష్ణా | 0.63 cr |
నెల్లూరు | 0.54 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.96 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.05 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 13.01 cr |
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.13.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 వ రోజున కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది కానీ.. టార్గెట్ ను బట్టి చూసుకుంటే అది చాలా తక్కువ.
రెండో వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గర పడుండేది. కానీ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఈ శుక్రవారం ‘భీమ్లా నాయక్’ సినిమా వస్తుంది. దానికి ఒక్క రోజు ముందు ‘వలీమై’ వస్తుంది. కాబట్టి ఈ వారాన్ని క్యాష్ చేసుకుని ఉండుంటే.. భారీ నష్టాల నుండీ బయ్యర్స్ తప్పించుకునేవారు. కానీ రెండో వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది ‘ఖిలాడి’.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!