Kiara Advani Car Cost: నటికీయారా కొన్న కారు ఖరీదు ఎంతో తెలుసా?

నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి కీయారా అద్వానీ ఒకరు. ఈమె ఈ ఏడాది నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా పెళ్లి తర్వాత కూడా కియార అద్వానీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత మొదటిసారి కియరా అద్వానీ ఇలా ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ S క్లాస్ మోడల్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ కారు సుమారు ధర 3 కోట్ల 40 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కారు ధర తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.

ఇలా ఈమె (Kiara Adivi) కొనుగోలు చేసిన కారు ధర ఏకంగా మూడు కోట్ల అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మే 26నే కార్ రిజిస్ట్రేషన్ కూడా అయిందని ముంబై RTO ఆఫీస్ నుంచి సమాచారం. ఇలా ఈమె ఖరీదైన కారును కొనుగోలు చేశారని విషయం తెలియడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అలాగే రామ్ చరణ్ సరసన నటించే గేమ్ చేంజర్ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇదివరకే రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus