కియారా అద్వానీ (Kiara Advani) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.మహేష్ బాబు (Mahesh Babu) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాతో ఈమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో రాంచరణ్ (Ram Charan) ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) లో కూడా హీరోయిన్ గా నటించింది. తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది. 2023 లో కియారా తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాని (Sidharth Malhotra) పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా కియారా అభిమానులతో ఒక గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది. విషయం ఏంటంటే.. హీరోయిన్ కియారా అద్వానీ తల్లికాబోతుందట. ఈ గుడ్ న్యూస్ ను ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా అలాగే ఆమె కలిసి ప్రేమగా చిట్టి సాక్సులు చేతిలో పెట్టుకుని తీసిన ఫోటోని షేర్ చేసింది కియారా. దీనికి ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో వెంటనే సంజయ్ కపూర్, ,సమంత, రకుల్, రియా కపూర్, ఇషాన్ కట్టర్, హ్యూమా ఖురేషి వంటి బాలీవుడ్ నటీనటులు అంతా తమ బెస్ట్ విషెస్ ను తెలుపుతూ కంగ్రాట్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే నెటిజన్లు కూడా ఈ కపుల్ కి ‘కంగ్రాట్స్..పండంటి బిడ్డకు జన్మనివ్వాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొంతమంది అయితే కియారా ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కి ఈ కారణంతోనే హాజరుకాలేదేమో అని అభిప్రాయపడుతున్నారు. జనవరిలో వచ్చిన రాంచరణ్ – శంకర్ (Shankar) ..ల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో కియారానే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.