వైరల్ అవుతున్న చరణ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మాత్రం రెండు సినిమాల్లోనే నటించింది. అవి రెండు కూడా స్టార్ హీరోల సినిమాలే..! త్వరలో మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించబోతుంది. ఆ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్లూస్ చాలు అనుకుంట.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టడానికి. యెస్.. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కియారా అద్వానీ.

చిన్నప్పుడు ఈమె తన తమ్ముడితో ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటో ఇది. నవ్వుతూ చలాకీగా ఫోజు ఇచ్చింది.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఫోటోని మరింతగా షేర్ లు చేస్తున్నారు. మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

ఆ మూవీలో తన గ్లామర్ తో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. అటు తర్వాత రాంచరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఇదే హీరోతో శంకర్ తెరకెక్కిస్తున్న మూవీలో కూడా హీరోయిన్ గా నటించడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో దిల్ రాజు రూపొందిస్తుండడం విశేషం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus