మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఒక సీక్రెట్ ఫేస్ బుక్ ఎకౌంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన మెగా అభిమానులకు లీక్ చేసింది. ఆ ఎకౌంట్ ద్వారా చరణ్ ఫేస్ బుక్ అప్డేట్స్ అన్నీ చూస్తుంటాడట. ఇవాళ చరణ్ కొత్త సినిమా “వినయ విధేయ రామ” హీరోయిన్ కీయారా అద్వానీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చరణ్ కి సంబంధించిన కొన్ని ప్రయివేట్ విషయాలు బయటపెట్టింది. చరణ్ కి ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఉందని, ఆ ఎకౌంట్ ద్వారా చరణ్ అన్నీ డబ్ స్మాష్ వీడియోలు చూస్తుంటాడని కీయారా పొరపాటున చెప్పేసింది.
View this post on Instagram@kiaraaliaadvani With #Ramcharan #vvr #vinayavidheyarama #kiaraadvani #tollywood
A post shared by Filmy Focus (@filmyfocus) on
సెలబ్రిటీలు ఈ తరహా సీక్రెట్ ఎకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ… తమ ఫేవరెట్ హీరో చరణ్ సీక్రెట్ ఎకౌంట్ ఏమిటా అని ఆయన అభిమానులందరూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ను జల్లెడపట్టేస్తున్నారు. అలాగే.. చరణ్ సెట్స్ లో చాలా జోవియల్ గా ఉంటాడని, ఒక్కసారి కూడా చరణ్ ను సెట్స్ లో కోపంగా చూడలేదని తెగ పొగిడేస్తుంది కీయారా. అయినా.. కీయారాకి ఇలా తాను నటిస్తున్న హీరోలకు గొడుగులు పట్టడం అనేది చాలా కామన్. భారత్ అనే నేను టైమ్ లో మహేష్ ను కూడా ఇలాగే ఎత్తేసింది. ఇప్పుడు చరణ్ ను మునగ చెట్టు ఎక్కిస్తోంది.