కియారా అద్వానీ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే..!మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రానికి ఆమె తీసుకున్న పారితోషికం రూ.80 లక్షలు. అటు తర్వాత చరణ్ తో నటించిన ‘వినయ విధేయ రామ’ మూవీకి కూడా ఆమె అంతే పారితోషికం అందుకుంది.ఈ రెండు సినిమాలకి నిర్మాత డి.వి.వి.దానయ్యే కాబట్టి.. రెండు ప్రాజెక్టులకి ఒకే సారి రూ.1.6 కోట్లకు అగ్రిమెంట్ చేయించుకున్నాడు.
కానీ తర్వాత ఈమె బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది.’కభీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ లు పడడంతో ఈమె రేంజ్ అక్కడ రూ.4 కోట్లకు పెరిగింది. అందుకే మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు. పూజా హెగ్డే వంటివారు కూడా రూ.3 కోట్లకు ఓకే చెప్పేస్తుండడంతో కియారాని టాలీవుడ్ దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చరణ్- శంకర్ ల సినిమా కోసం కియారా అవసరం పడింది. బాలీవుడ్ లో ఆ చిత్రాన్ని మార్కెట్ చేసుకోవాలి అంటే ఇలాంటి స్టార్ హీరోయిన్ సపోర్ట్ కావాలి.
అందుకే కియారా రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక నో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి.. కియారా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాత దిల్ రాజు అంగీకరించినట్టు తెలుస్తుంది. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎక్కువగా రూ.6కోట్లు పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నయన తార నిలిచింది. ‘సైరా’ కి ఆమె అంతమొత్తం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె తర్వాతి స్థానంలో కియారా నిలిచినట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!