Kiara Advani: కియారా అద్వానీ రోబ్ డ్రెస్, మాక్సీ డ్రెస్ రేటు ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.. కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా వీళ్ల గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన రుచికరమైన వంటకాలను వడ్డించారని సమాచారం. ఫోటోలు, వీడియోలు తీయకుండా కియారా – సిద్ధార్థ్‌ ముందుగానే అందర్నీ రిక్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఒకొక్కటిగా వారే పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్‌ ప్యాలస్‌లో.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది.. వీరిపెళ్లి ఖర్చు నుండి ప్రతి ఫంక్షన్‌కి సంబంధించిన విశేషాలు బయటకి వస్తున్నాయి. రీసెంట్‌గా కియారాకు భర్త సిద్దార్థ్ ఇచ్చిన నల్ల పూసల కాస్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. గోల్డ్ చైన్‌కి మధ్యలో బ్లాక్ బీడ్స్..

అలాగే బిగ్ డైమండ్ పెండెంట్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ మంగళ సూత్రాన్ని సబ్యసాచి డిజైన్ చేశారట. దాని కాస్ట్ అక్షరాలా.. రూ. 2 కోట్లని తెలుస్తోంది. కియారా తమ పెళ్లికి సంబంధించి ఓ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసింది. కొత్త కపుల్ ఇద్దరూ డ్యాన్స్ చేయడం దగ్గరి నుండి దండలు మార్చుకోవడం, ఆత్మీయంగా కౌగలించుకోవడంతో పాటు లవ్లీ లిప్ లాక్ వంటి మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు కియారా ధరించిన డ్రెస్సెస్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. ఆమె ధరించిన స్టైలిష్ కాస్ట్యూమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

RETROFETE GABRIELLE ROBE DRESS – కాస్ట్ : రూ. 55,166/-..

SAAKSHA & KINNI MAXI DRESS – కాస్ట్ : రూ. 25,000/-..

సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కియారా అద్వానీ మెరిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus