Kiccha Sudeep: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. కన్నడ స్టార్ ఏమన్నారంటే..?

ఉత్తరాది రాజకీయ నేతలు హిందీ ప్రేమను దక్షిణాది వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే వివాదం చాలా దశాబ్దాలుగా ఉంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు హిందీ ఇంపోజిషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండేది ఎక్కువగా ఉత్తరాది నేతలే కావడంతో హిందీని సౌత్ మీద రుద్దే ప్రయత్నాలు జరుగుతుంటాయి. రీసెంట్ గా హోం మంత్రి అమిత్ షా కూడా.. భిన్న రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడాల‌ని, ఇంగ్లిష్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని చెప్పడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

దీనిపై సౌత్ పొలిటిషన్స్ తో పాటు సామాన్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు కన్నడ టాప్ స్టార్స్ లో ఒకరైన కిచ్చా సుదీప్.. హిందీ భాషపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కన్నడ సినిమా ‘కేజీఎఫ్2’ పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ సినిమాను పొగుడుతూ కొన్ని కామెంట్స్ చేశారు కిచ్చా సుదీప్. హిందీ ఇంకెంత‌మాత్రం జాతీయ భాష కాదని అన్నారు. కేజీఎఫ్ గురించి ఆంద‌రూ మాట్లాడుతూ ఓ క‌న్న‌డ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించార‌ని అంటున్నార‌ని, అది క‌రెక్ట్ కాద‌ని చెప్పారు.

ద‌క్షిణాది ద‌ర్శ‌కులు తీస్తున్నవి ఇండియ‌న్ సినిమాల‌ని.. వాటిని భాషా భేదం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తున్నార‌ని సుదీప్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ పాన్ ఇండియా పేరుతో సినిమాలు తీసి తెలుగు, తమిళంలో డబ్ చేస్తే అవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోతున్నాయ‌ని.. కానీ ఇక్క‌డి సినిమాలు దేశ‌వ్యాప్తంగా ఆడుతున్నాయ‌ని.. అందుకే హిందీ ఇంకెంత‌మాత్రం జాతీయ భాష కాద‌న్న‌ది త‌న అభిప్రాయ‌మ‌ని సుదీప్ అన్నాడు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus