మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘కిన్నెరసాని’.అన్ శీతల్ అనే కొత్తమ్మాయి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్’ ‘శుభమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.దేశ రాజ్ ఈ చిత్రానికి రైటర్. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కిన్నెరసాని’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి నేరుగా జీ5లో విడుదల కాబోతుంది.
వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్ తో పాటు కాశీష్ ఖాన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.రవీంద్ర విజయ్ విలన్ పాత్రని పోషించారు. ‘మీ పాప ఒక అద్భుతం పార్వతి గారు.. కానీ అద్భుతం జరిగే ప్రతీ చోట ఆపదలు ఉంటాయి’ ‘ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి… అది ద్వేషానికి అయినా.. చివరికి ప్రేమ కైనా’ వంటి డైలాగులతో ఈ చిత్రం టీజర్ ఈ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జీ5 ఓటీటీ సంస్థ కూడా ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలకు పోటీగా ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ కలిగిన సినిమాలకి సంబంధించిన హక్కులను వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ‘కిన్నెరసాని’ పై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!