కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ TVK అనే రాజకీయ పార్టీని స్థాపించి, తమిళనాడు మొత్తం ప్రచారం నిమిత్తం యాక్టివ్ గా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల కరూర్ ప్రాంతంలో రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందారు. ఇందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉండటం అనేది అత్యంత బాధాకరమైన విషయం.
ఈ విషయంపై విజయ చింతిస్తూ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. అయితే విజయ్ వ్యవహారంపై తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్ స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఈ విషయంపై స్పందిస్తూ.. ” కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా ఊహించని ఘోరాలు జరుగుతాయి. అది చిన్న తప్పు అయితే సరిచేసుకోవాలి. ఒకవేళ పెద్దదైతే మళ్ళీ ఆ ఘోరం జరగకుండా జాగ్రత్త వహించాలి… ఛీ” అంటూ ఘాటుగా రాసుకొచ్చారు. సత్య రాజ్ కామెంట్స్ లో 2 రకాల ఉద్దేశాలు ఉన్నాయి.
ఒకటి.. విజయ్ పార్టీ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. ఒకసారి 8 మంది.. తర్వాత ఆయన వాహనం కింద పది ఒకరిద్దరు కుర్రాళ్ళు మరణించారు. ఇలా ఆయన ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొంతమంది మరణించారు. ఇప్పుడు కరూర్ ఘటనలో మరో 30 మంది మరణించారు. ముందు నుండి విజయ జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తే.. ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు కదా.. అనేది సత్య రాజ్ ఉద్దేశం కావచ్చు.