దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘క’ (KA) సినిమా చేశాడు. అది మంచి విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం రూ.50 కోట్ల క్లబ్ లో చేరాడు. త్వరలో ‘దిల్ రుబా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దానికి మంచి బిజినెస్ జరుగుతుంది.వాస్తవానికి ‘క’ కంటే ముందు ‘దిల్ రుబా’ రావాలి. దాని షూటింగ్ ముందే కంప్లీట్ అయ్యింది. కాకపోతే ‘క’ సినిమా కంటెంట్ బాగా వచ్చింది అనే కాన్ఫిడెన్స్ తో.. ఆ సినిమాని ముందు రిలీజ్ చేశాడు. దాని వల్ల ఇప్పుడు ‘దిల్ రుబా’ కి హైప్ పెరిగింది.
ఇక ఇదే ఊపులో పారితోషికం కూడా పెంచేశాడట కిరణ్ అబ్బవరం. గతంతో పోలిస్తే ఇప్పుడు రూ.2 కోట్లు పెంచేశాడట. ‘క’ సినిమాకి ముందు వరకు రూ.3, రూ.4 కోట్లు పారితోషికం తీసుకునే కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.అంతేకాదు ప్రొడక్షన్ చాలా వరకు అతని టీం చూసుకుంటుందని చెప్పాడట. అందులో కూడా తన టీంని అడ్డం పెట్టుకుని మరింతగా వెనకేసుకోవచ్చు అనేది ఈ కుర్ర హీరో ప్లాన్ అని తెలుస్తుంది. ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు క్యాష్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి.. కిరణ్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు స్పష్టమవుతుంది.