Kiran Abbavaram: చిరు కామెంట్‌.. కిరణ్‌ అబ్బవరం మనసును బాధపెట్టిందిగా!

చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను, ఎడిట్‌ చేసి మీ ఫొటో పెడితే మీకైమైనా కోపం వస్తుందా? చిరంజీవి ఫ్యాన్‌ అయితే కచ్చితంగా రాదు అని చెప్పొచ్చు. అయితే కిరణ్‌ అబ్బవరం మాత్రం హర్టయ్యాడు. యువ హీరోగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో ప్రయాణం జోరు పెంచుకుంటున్న కిరణ్‌ అబ్బవరం ట్విటర్‌ వేదికగా తన రియాక్షన్‌ చూపించాడు. అయితే అక్కడ ఆయన అంతగా రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం ఏముంది అనేది అర్థం కావడం లేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘రాజా వారు రాణి వారు’ థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మంచి స్పందన సంపాదించింది. ఆ తర్వాత రచయితగా మారి, మేకింగ్ విషయంలోనూ అన్నీ తానై చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. కానీ ఆ తర్వాత సినిమాలేవీ ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో ఇప్పుడు నెక్స్ట్‌ సినిమాల విషయంలో ఆసక్తి ఏర్పడింది.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు కిరణ్‌ అబ్బవరం మీదకు వచ్చింది. ‘నేను, రవితేజ మాత్రమే వరుసగా సినిమాలు చేస్తున్నాం’ అని చిరంజీవి ఆ సభలో అన్నారు. ఆ వీడియోకు కిరణ్‌ అబ్బవరం, సుధీర్‌బాబు ఫొటోలు పెట్టి ఓ వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. దానికి రీట్వీట్‌ చేసిన కిరణ్‌ అబ్బవరం తన ఇబ్బందిని వెలిబుచ్చాడు. గ్యాప్ లేకుండా ఇద్దరూ సినిమాలు తీసి జ‌నాల మీదికి వ‌దిలేస్తున్న‌ట్లుగా ఈ పోస్టు, దాని కింద కామెంట్లు ఉండ‌డంతో కిర‌ణ్ హ‌ర్ట‌యిన‌ట్లున్నాడు.

దీంతో ‘‘నా మూడేళ్ల కెరీర్‌లో ఐదు సినిమాలే వచ్చాయి. నా పేరు మీద ఇంకెవరైనా సినిమాలు చేసి ఉంటే చెప్పండి.. మీ సమాధానం కోసం వెయిట్‌ చేస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశాడు కిరణ్‌ అబ్బవరం. అయితే దానికి ఆ నెటిజన్‌ నుండి రిప్లై లేదు. అయితే నెటిజన్లు మాత్రం ‘ఇలాంటి వాటికి రిప్లైలు ఎందుకన్నా’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం ‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ’ పనుల్లో బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కాబోతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus