కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. షార్ట్ ఫిలింస్ చేసి సినిమాల్లోకి వచ్చిన ఇతను ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది మంచి సినిమా అనిపించుకుంది. ఆ తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ అనే చిత్రం చేశాడు. ఇది కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్పీడ్ పెంచి సినిమాలు చేశాడు. ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి చిత్రాలు ఒకే అనిపించాయి.
అయితే ఇటీవల వచ్చిన ‘మీటర్’ సినిమా అత్యంత దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. మాస్ హీరో ఇమేజ్ ను అందుకోవాలనే మోజుతో మాస్ సినిమాని యంగ్ హీరోలు కానీ, యంగ్ డైరెక్టర్లు కానీ ఎంత చీప్ గా అంచనా వేస్తున్నారు అనేది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. అన్నిటికీ మించి కిరణ్ అబ్బవరంకి పోలీస్ కథలు అస్సలు కలిసి రావడం లేదు.ముందుగా ‘సెబాస్టియన్’ చేశాడు అది పెద్ద ప్లాప్ అయ్యింది. అయినా ఇప్పుడు ‘మీటర్’ చేశాడు..
దీని ఫలితం మరింత ఘోరం. అలాగే ఇప్పుడిప్పుడే మంచి హీరో అనే ముద్ర వేయించుకున్న (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరంకి… నెగిటివిటీ పెరగడానికి ‘మీటర్’ వంద శాతం కృషి చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కిరణ్ యూత్ కి దగ్గరయ్యాడు అనేది నిజం. పెద్ద నిర్మాతల దృష్టిలో పడ్డాడు అనేది కూడా నిజం. ఇప్పుడు అతనికి మినిమమ్ మార్కెట్ ఉంది అనేది కూడా నిజం.
జనాలు కిరణ్ అబ్బవరం సినిమా అంటే తప్పకుండా చూడాలి అనుకుంటున్న మాట కూడా పచ్చి నిజం. ఇలాంటి టైంలో అతను కుటుంబ కథా చిత్రాలు, యూత్ ఫుల్ చిత్రాలు చేస్తే ఇప్పుడున్న మార్కెట్ పెరుగుతుంది కానీ.. ‘మీటర్’ లాంటి సినిమాలు చేస్తే మూలన పడిపోవడం గ్యారంటీ