Kiran Abbavaram: ఈ ఏడాది కిరణ్ ఖాతాలో ఇంకో హిట్టు.. సాధ్యమేనా?
- November 11, 2024 / 11:01 AM ISTByFilmy Focus
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన ‘క'(KA) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. రెండో వీకెండ్ కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ‘క’ బాక్సాఫీస్ జోరు తగ్గకుండానే ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడట కిరణ్ అబ్బవరం.
Kiran Abbavaram

అవును వాస్తవానికి ‘క’ అనే సినిమా కిరణ్ అబ్బవరం నుండి వస్తుందని.. 4 నెలలకి ముందు వరకు చాలా మందికి తెలీదు. ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) తర్వాత కిరణ్ అబ్బవరం నుండి ‘దిల్ రుబా’ అనే సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎక్కువగా ఆ సినిమానే ప్రచారంలో ఉంటూ వచ్చింది. ‘దిల్ రుబా’ ఓ లవ్ స్టోరీ. అందువల్ల ట్రేడ్లో పెద్దగా అంచనాలు లేవు. మరోపక్క ‘క’ అనేది డిఫరెంట్ అటెంప్ట్. సినిమా బాగా వచ్చింది అని కిరణ్ అబ్బవరం గ్రహించాడు.

‘దిల్ రుబా’ కంటే ముందు ‘క’ ని రంగంలోకి దింపితే… వర్కౌట్ అవుతుంది అని అతను ఆలోచించాడట. అతను అనుకున్నదే నిజమైంది. సో ఇప్పుడు ‘దిల్ రుబా’ కి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయి. అందుకే ‘దిల్ రుబా’ ని కొన్నాళ్ళు ఆపి ‘క’ ని రిలీజ్ చేశాడు అని తెలుస్తుంది. ఇక ‘దిల్ రుబా’ చిత్రాన్ని విశ్వ కరుణ్ డైరెక్ట్ చేయగా.. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది.














