సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు మరణిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అయితే నటీనటులు లేదు అంటే సాంకేతిక నిపుణులు వాళ్ళు కాదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా ఎవరోఒకరు మరణిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
Delhi Ganesh
రెండు రోజుల క్రితం హిందీ టెలివిజన్ రంగానికి చెందిన యువ నటుడు నితిన్ చౌహాన్ మరణించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. కోలీవుడ్లో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ (Delhi Ganesh) ఈరోజు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య, వృద్థాప్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో చివరి శ్వాస విడిచినట్టు స్పష్టమవుతోంది.
ఢిల్లీ గణేష్ వయసు 80 యేళ్ళు. ఈయన అసలు పేరు గణేశన్ (Delhi Ganesh).’పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా మారిన ఇతను ‘ఎంగమ్మ మహారాణి’ చిత్రంలో హీరోగా కూడా నటించారు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించారు.
40 యేళ్ళుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్న ఢిల్లీ గణేష్ చివరగా ‘ఆరణ్మనై4’, ‘ఇండియన్2’ చిత్రాల్లో కనిపించారు. ఢిల్లీ గణేష్ (Delhi Ganesh) మరణవార్తతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడి సినీ నటులు ఆశిస్తున్నారు.