Kiran Rathod Remuneration: ‘బిగ్ బాస్ 7’ కి గాను కిరణ్ రాథోడ్ పారితోషికం ఎంతంటే..!

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7′ కి 12 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది కిరణ్ రాథోడ్. ఈమె చాలా మందికి సుపరిచితమే. తమిళంలో ‘జెమిని’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈమెకి మంచి ఆఫర్లు వచ్చినా సరైన కథలు, పాత్రలు ఎంపిక చేసుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. అందువల్ల టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పోగొట్టుకుంది. తర్వాత వ్యాంప్ పాత్రలు, గ్లామర్ రోల్స్ వంటివి చేస్తూ కాలం గడిపింది.

ఆ తర్వాత ఆ పాత్రలు కూడా కరువయ్యాయి. స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం రెడీగా ఉన్న టైంలో ఈమెకు బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ వచ్చింది. కానీ మొదటి వారమే ఈమె ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్టు చూపించారు. నామినేషన్స్‌, ఓటింగ్‌ ప్రక్రియ ప్రకారమే కిరణ్‌ రాధోడ్‌ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఈమెకు తక్కువ ఓట్లు రావడం అలాగే ఈమె (Kiran Rathod) డిజిటల్ టీంని కూడా పెట్టుకోకపోవడం వల్ల..

‘బిగ్ బాస్ 7 ‘ జర్నీ ముగించుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక హౌస్ లో ఉన్న వారం రోజులకు గాను కిరణ్ రాథోడ్ కి ‘బిగ్ బాస్’ యాజమాన్యం ఒక్కో రోజుకి గాను రూ.45 వేల చొప్పున పారితోషికం చెల్లించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాని లెక్క రూ.3 లక్షల పైనే ఉంటుందని స్పష్టమవుతుంది. ఇందులో జీఎస్టీ అదనంగా అంటే ప్రత్యేకంగా చెల్లించినట్టు సమాచారం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus