బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.హిందీ ‘ఛత్రపతి’తో స్ట్రక్ అవ్వడం వల్ల అతని కెరీర్లో ఊహించని విధంగా గ్యాప్ వచ్చింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్ చేసుకున్నప్పటికీ.. అవి డిలే అవుతూ వస్తున్నాయి. ఆల్రెడీ ‘భైరవం’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మంచు మనోజ్, నారా రోహిత్ వంటి హీరోలతో కలిసి చేసిన ఆ రీమేక్ సినిమా పర్వాలేదు అనిపించింది కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ఇప్పుడు ‘కిష్కింధపురి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.’చావు కబురు చల్లగా’ అనే ఫిలాసఫికల్ మూవీ చేసిన కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో చేసిన హారర్ మూవీ ఇది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్లో ఎక్కువగా ఆమెనే హైలెట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘మొదటి 15 నిమిషాల్లోనే ఆడియన్స్ ఫోన్లు పక్కనపెట్టి సినిమా చూస్తారు.. అలా జరగకపోతే నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతా’ అంటూ ఓ ఛాలెంజ్ కూడా విసిరాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతని కాన్ఫిడెన్స్ బాగానే ఉన్నప్పటికీ సినిమాపై బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి స్పెషల్ గా షో వేసి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
సినిమా చూశాక వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారట. సినిమా 2 గంటల 5 నిమిషాలే ఉన్నప్పటికీ… చాలా భయపెట్టే అంశాలు ఉండటంతో ఎప్పుడెప్పుడు అవుతుందా? అనే ఫీలింగ్ తో కదలకుండా సినిమా చూసినట్టు వారు తెలియజేశారు. సినిమాకి టెక్నికల్ టీం ప్రాణం పెట్టి పని చేసినట్టు… చెబుతున్నారు. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలెట్ అని.. సీన్ మూడ్ కి తగ్గట్టు అతను కంపోజ్ చేసిన సౌండింగ్ చాలా బాగా కుదిరింది అంటున్నారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పెర్ఫార్మన్స్..లు కూడా బాగున్నాయని.. ఒకసారి కచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా సినిమా ఉందని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజు ఎలాంటి టాక్ వస్తుందో..!