సినిమా, రాజకీయం.. రెండు భిన్నమైన రంగాలు. ఈ రెండింటిలో అడుగు పెట్టి విజయం సాధించారు ధీర వనిత.. జయ లలిత. యవ్వనంలో అపర సౌందర్య రాశిగా సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈమె.. ప్రజా ప్రతినిధిగా పేదలకు అండగా నిలిచి అమ్మగా పిలిపించుకున్నారు. వివాదాలు, అవినీతి ఆరోపణలు, అవమానాలు ఎన్ని ఎదురైనా వాటికి ఎదురు నిలిచి.. గెలిచి ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజులక్రితం ఆస్పత్రిలో చేరిన జయలలిత ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ పోరాటంలోనూ ఆమె తప్పకుండా గెలిచి తీరుతుందని ఫిల్మీ ఫోకస్ విశ్వసిస్తోంది. పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఈ సందర్భంగా అమ్మ జీవిత పయనం పై స్పెషల్ ఫోకస్..
1. కోమవల్లి1948 ఫిబ్రవరి 24 న జయలలిత మైసూర్ రాష్ట్రంలో జన్మించారు. అప్పుడు కర్ణాటక స్టేట్ గా ఏర్పడలేదు. తల్లి దండ్రులు జయకుమార్, వేద వల్లి. వీరిది బ్రాహ్మణ కుటుంబం. అప్పట్లో పిల్లలకు రెండు పేర్లు ఉండేవి .. అందుకే జయలలితకు అమ్మమ్మ కోమ వల్లి పేరు పెట్టారు. ఏడాది తర్వాత జయలలిత అని నామ కరణం చేశారు.
2. బెస్ట్ స్టూడెంట్జయలలిత తండ్రి జయకుమార్ లాయర్ చదివినప్పటికీ పని చేసేవారు కాదు. వ్యసన పరుడై చిన్న వయసులోనే మరణించారు. అతను చనిపోయిన సమయానికి జయలలితకు రెండేళ్లు. దీంతో ఎంతో కష్టాలు పడి తల్లి వేదవల్లి కూతురిని మెట్రిక్ లేషన్ వరకు చదివించింది. జయ లలిత బాగా చదువుకునేది. మెట్రిక్ లేషన్లో మంచి మార్కులు రావడంతో ప్రభుత్వమే ఉన్నత చదువులు అభ్యసించడానికి స్కాలర్ షిప్ ప్రకటించింది.
3. నటనలో స్ఫూర్తి అమ్మకుటుంభారం మీద పడడంతో తల్లి వేదవల్లి తన సోదరి సహాయంతో చెన్నై వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేది. సంధ్య గా పేరు మార్చుకుని అనేక చిత్రాల్లో నటించింది. సెలవుల్లో తల్లి తో షూటింగ్ కి జయలలిత వెళ్లేవారు.. తల్లి నటనను చూస్తూ స్ఫూర్తి పొందారు. అలా సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు.
4. బాలనటిగా ప్రవేశం1961 లో బాలనటిగా శ్రీశైల మహాత్య అనే కన్నడ సినిమాలో పార్వతి దేవిగా కనిపించారు. 1964 లో కన్నడ సినిమా “చిన్నది గొంబే ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు. తొలి పారితోషికం 3000. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు.
5. 16 ఏళ్లకే స్టార్తెలుగులో మనసు మమత చిత్రం ద్వారా ప్రవేశించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కి జోడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలా 16 ఏళ్లకే స్టార్ అయ్యారు. అప్పటి తరం తెలుగు హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లతో కలిసి తెలుగులో అనేక సినిమాలు చేశారు.
6. గురువు ఎమ్ జి ఆర్60, 70 దశకంలో తెలుగు, తెలుకు, కన్నడ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా జయలలిత పేరు గాంచారు. అప్పుడే ప్రముఖ తమిళ హీరో ఎం జె ఆర్ కు బాగా సన్నిహితులయ్యారు. ఆయనతో కలిసి 28 సినిమాల్లో నటించారు. అప్పుడు అందరూ మిస్ ఎమ్ జి ఆర్ గా ఆమెను పిలుస్తుంటే, జయలలితమాత్రం ఎమ్ జి ఆర్ తన గురువని చెప్పేవారు. సినీ కెరీర్ లో ఆమె ఐదు భాషల్లో దాదాపు125 సినిమాలు చేస్తే అందులో 110 హిట్ సాధించాయి.
7. మంచి గాయనిజయలలిత సినీ రంగంలో ప్రవేశించక ముందు భరతనాట్యం, కూచిపూడి, కథక్ నృత్యాలను అభ్యసించారు. పలు ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత డ్యాన్సులతో అడగొట్టడమే కాకుండా తాను నటించే పాటలను సొంతంగా పాడుకునే వారు. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు.
8. రాజకీయ అరంగ్రేటంనటుడు ఎం జి రామచంద్రన్ 1977 లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు జయలలిత రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఎం జి ఆర్ పిలుపు మేరకు 1982 లో ఏఐఏ డీ ఎం కె పార్టీలో చేరిన ఆమె 1984 లో రాజ్య సభకు ఎంపికయ్యారు.
9. అనుకోకుండా సీఎం1984 లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జి ఆర్ ఆరోగ్యం క్షీణిస్తే ఆ బాధ్యతలను జయలలిత స్వీకరించారు. అతను మరణించడంతో ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. కొన్ని కారణాల వల్ల దిగిపోయారు. మళ్లీ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి 1991 లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు ముఖ్యమంత్రి సింహాసనం పై కూర్చున్నారు.
10. పేదలకు అమ్మపేదలకోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను జయలలిత ప్రారంభించారు. తమ ప్రభుత్వం తరపున ఒక రూపాయికే ఇడ్లీ, 13 రూపాయలకే ఫుల్ మీల్స్ అందించే క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ బస్తాను మార్కెట్ ధరకు సగానికి తగ్గించి అందించారు. ఇలా ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను ప్రవేశపెట్టి తమిళీయులకు అమ్మగా జయలలిత కీర్తి పొందారు.