Kollywood: 90స్ లవర్ బాయ్ సెకండ్ ఇన్నింగ్స్.. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా..
- January 23, 2026 / 05:38 PM ISTByFilmy Focus Writer
90వ దశకంలో తన గ్లామర్ అండ్ హెయిర్ స్టైల్‌తో ఒక ఊపు ఊపిన చాక్లెట్ బాయ్ అబ్బాస్ గుర్తున్నారు కదా. ‘ప్రేమదేశం’ సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా మారిన ఆయన, దాదాపు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ సీనియర్ హీరో మళ్ళీ కెమెరా ముందుకు రావడం ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Kollywood
ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో అబ్బాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక మెచ్యూర్డ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘హ్యాపీ రాజా’లో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హీరోయిన్ శ్రీ గౌరీప్రియ రెడ్డికి తండ్రిగా అబ్బాస్ కనిపించబోతుండటం విశేషం. దాదాపు పుష్కర కాలం తర్వాత ఆయన ముఖానికి రంగు వేసుకోవడంతో సెట్స్‌లో కూడా సందడి నెలకొంది. తన వయసుకి తగ్గట్టుగా ఉండే హుందాతనంతో కూడిన పాత్ర కావడంతోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిజానికి అబ్బాస్ సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి న్యూజిలాండ్ వెళ్ళిపోయిన ఆయన, అక్కడ ఒక సామాన్యుడిలా జీవితాన్ని గడిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేయడం నుండి మెకానిక్ వరకు రకరకాల వృత్తులు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గతేడాది చెన్నైకి తిరిగి వచ్చినప్పటి నుండి ఆయన మళ్ళీ బిజీ అవుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అధికారికంగా షూటింగ్‌లో పాల్గొనడంతో ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు.
అబ్బాస్ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పన్నెండేళ్లు గడిచినా ఆయనలో అదే డాషింగ్ గ్లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా, టాలీవుడ్ మేకర్స్ కూడా ఆయన కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ రోల్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2026లో రిలీజ్ కానున్న ఈ చిత్రం అబ్బాస్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్‌గా నిలవబోతోంది.













