టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

2023 సంక్రాంతి పండుగకు భారీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఈ సినిమాలలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. థియేటర్ల కేటాయింపు విషయంలో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వారసుడు సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించడంపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తమిళ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లను ఇవ్వని పక్షంలో తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటామని నామ్ తమిళార్ కట్చి ప్రెసిడెంట్, డైరెక్టర్ సీమాన్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి తాజాగా విడుదలైన లేఖను ఆయన ఖండించడంతో పాటు ఈ కామెంట్లు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తమిళంలో విడుదలై సక్సెస్ సాధించాయని ఈ సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినా మేము ఇబ్బందులు క్రియేట్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. డబ్బింగ్ సినిమాలను తమిళనాడులో రిలీజ్ చేసిన సమయంలో మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సీమాన్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సీమాన్ పేర్కొన్నారు. తమిళ సినిమాలకు తెలుగు నిర్మాతలు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదని సీమాన్ అన్నారు. ఇలా జరగని పక్షంలో తమిళనాడులో ఇతర భాషల సినిమాలను అడ్డుకుంటామని సీమాన్ అన్నారు. సీమాన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీమాన్ చేసిన కామెంట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాతలు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. పరిమిత సంఖ్యలో స్క్రీన్లు ఉండటం, అందరు హీరోలు పండుగలకు సినిమాలను రిలీజ్ చేయాలని భావించడం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. పెద్ద సినిమాలు రెండు వారాల గ్యాప్ తో విడుదలైతే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus