ఏదైనా పండుగ వస్తుంది అంటే పెద్ద సినిమాల రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవుతుంది అని అంతా భావిస్తారు. పెద్ద సినిమాల మేకర్స్ కూడా పండుగల సీజన్ ని క్యాష్ చేసుకోవాలని రిలీజ్ డేట్ లు కొన్ని నెలల ముందే బ్లాక్ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఏంటో కానీ.. సంక్రాంతి టైం నుండి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో డబ్బింగ్ సినిమాలను దింపుతూ వస్తున్నారు. అందులోనూ తమిళ డబ్బింగ్ సినిమాల హడావిడి జనవరి నెల నుండి ఉంది.
సంక్రాంతికి ‘వారసుడు’ వచ్చింది.’వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ సినిమాల కంటే ఈ సినిమా గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఎందుకంటే దీనికి నిర్మాత మన దిల్ రాజు కాబట్టి. ! ఇక దాని తర్వాత మహాశివరాత్రి టైంలో ‘సార్’ సినిమా వచ్చింది. దాని పక్కన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వచ్చింది కానీ.. పెద్ద సినిమా అయితే రాలేదు. అది కూడా అంతంత మాత్రమే ఆడింది.
ఇక సమ్మర్ కి ‘బిచ్చగాడు 2 ‘ కూడా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆగస్టులో ‘భోళా శంకర్’ పక్కన ‘జైలర్’ వచ్చి దెబ్బ కొట్టింది. అలాగే వినాయక చవితి పండుగకి ‘మార్క్ ఆంటోనీ’ ఎక్కువగా సందడి చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేసింది. ఇక సెప్టెంబర్ 28 కి కూడా ‘చంద్రముఖి 2’ వంటి డబ్బింగ్ సినిమా ‘స్కంద’ పక్కన రిలీజ్ అవుతుంది.
అంతేకాదు ‘దసరా’ కి ‘లియో’ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘భగవంత్ కేసరి’ చిత్రాలకి పోటీగా రిలీజ్ అవుతుంది. దీపావళికి ‘జపాన్’ అలాగే ‘జిగర్తాండ 2 ‘ వంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.