టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా సినిమాల బడ్జెట్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. టాలీవుడ్ సినిమాలు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల సినిమాలు అన్నీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో తమిళ హీరోల సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
అయితే తమిళ హీరోలు తమ సినిమాలకు సంబంధించి చెబుతున్న బడ్జెట్ లెక్కలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భవిష్యత్తు ప్రాజెక్ట్ కు ఏకంగా 400 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ హీరోగా 450 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఒక మూవీ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నమ్మే విధంగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ కంటే కోలీవుడ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్లను, లాభాలను అందిస్తున్నాయని చెప్పడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాలకు కూడా బడ్జెట్ ను పెంచి ప్రచారం చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు సినిమాల మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా తెలుగులో సక్సెస్ సాధించిన స్థాయిలో తమిళంలో పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడం లేదు.
కోలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలు సైతం ఇతర భాషల్లో సత్తా చాటుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని ప్రతిపాదనలు వ్యక్తమవుతున్నా స్టార్ హీరోలు అందుకు అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్స్ సినిమాలకు ఊహించని రేంజ్ లో డిమాండ్ పెరుగుతోంది.