Kona Venkat: చిరంజీవి – రవితేజ గురించి కోన వెంకట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒక హీరో సినిమా హిట్‌ అయితే మరో హీరో పార్టీ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? చాలా తక్కువగా కనిపించే ఈ సంప్రదాయం టాలీవుడ్‌లో కొందరు హీరోలు పాటిస్తుంటారు. అలాంటి వారిలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రథముడు అని అంటుంటారు. ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు, ప్రత్యేక రోజుల్లో ఆయన తన ఇంట్లో పార్టీ ఇస్తుంటారు. అతనికి బాగా సన్నిహితుల సినిమా అయితే ఆ పార్టీ ఇంకా పెద్దదిగా ఉంటుందట. ఇటీవల ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు ప్రముఖ రచయిత కోన వెంకట్.

కొడితే ఆ సినిమా హీరో స‌క్సెస్ పార్టీలు ఇవ్వ‌డం మామూలే. అలాంటిది ఓ హీరో హిట్టు కొడితే మరో హీరో పార్టీ ఇవ్వడం అంటే స్పెషలే కదా. అలాంటి స్పెషల్‌ పార్టీ ఇచ్చింది ఎవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ విషయాన్ని కోన వెంకట్‌ తెలిపారు. ర‌వితేజ అంటే చిరంజీవికీ, చిరంజీవి అంటే ర‌వితేజ‌కు చాలా అభిమానమనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు సహనటుడిగా రెండు సినిమాల్లో ఇద్దరూ నటించారు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో సహ హీరోగా నటిస్తున్నారు.

అయితే ర‌వితేజ సినిమా హిట్ట‌యిన ప్ర‌తీసారీ.. చిరు ఇంట్లో పార్టీ ఇచ్చేవారట. ఆ పార్టీకి పూరి, కోన వెంక‌ట్‌ లాంటివాళ్లు హాజరయ్యేవారట. ‘‘ర‌వితేజ హిట్టు కొట్టాడు క‌దా నేను పార్టీ ఇస్తా. మా ఇంట్లో స‌ర‌దాగా కూర్చుందాం రండీ’ అంటూ అందరినీ చిరంజీవి స్వ‌యంగా పిలిచేవారు. అలాంటి కొన్ని పార్టీల‌కు కోన వెంకట్‌ హాజరయ్యారట. త‌న‌కు కావ‌ల్సిన‌వాళ్లు హిట్టు కొడితే, తానే విజయం సాధించినంతగా ఆనందిస్తుంటారు చిరంజీవి అని చెప్పుకొచ్చారు కోన.

జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా చిరంజీవి ఇంట్లో మెగా పార్టీ ఈవెంట్ ఒకటి జ‌రిగింది. దానికి ర‌వితేజ కూడా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మరి ఇద్దరూ కలసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ 13న విడుదలవుతోంది. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించిన ఆ సినిమాకు బాబీ దర్శకుడు. మరి ఆ రోజు చిరంజీవి ఎలాంటి పార్టీ ఇస్తారో చూడాలి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus