కొందరు రైటర్లు తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని… వారి నుండీ సెపరేట్ అయిపోయిన వారిని ఎంతో మందిని చూసాము. అలా వేరైనా వారిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నవారిని కూడా మనం చూసాం. త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్లు అంతా ఈ కోవకు చెందిన వాళ్ళే..! అయితే ఈ లిస్టు లో సక్సెస్ కాని రైటర్స్ లో కొన వెంకట్ వంటి వారు కూడా ఉన్నారు. ‘వెంకీ’ చిత్రం నుండీ ఈయన టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల దగ్గర పనిచేస్తూ వచ్చాడు.
కానీ ‘బాద్ షా’ సినిమా టైములో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో ‘ఆగడు’ సినిమాకి ఆయన దూరం అయ్యాడు. తరువాత మెగాస్టార్ ‘బ్రూస్ లీ’ సినిమాకి కలిపారు కానీ.. మనస్పూర్తిగా కలవలేదు అని ఆ చిత్రం ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయం పై తాజాగా కోన వెంకట్ స్పందించాడు. కోన వెంకట్ మాట్లాడుతూ…”సినిమా అనేది టోటల్ టీమ్ వర్క్. సినిమా ఫ్లాపయినా, హిట్టయినా దానికి ప్రధాన కారణం టీమ్ వర్కనే చెప్పాలి.
ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో దర్శకుడి జోక్యం ఉంటుంది. నేను రాసిన పంచ్ డైలాగ్స్ ను ఆయన బెటర్ చేసుకునేవాడు. అందువలన నేనే అన్నీ చేశాను అనే ఫీలింగ్ ఆయనకి వచ్చిందా? నా కాంట్రిబ్యూషన్ ను ఆయన గుర్తించడం లేదా? అనే డౌట్ నాకు వచ్చింది. నాకు తగిన గుర్తింపు ఇవ్వనప్పుడు…దూరంగా ఉండటమే మంచిదనిపించింది. మళ్లీ మా కాంబినేషన్లో సినిమాలు రాకూడదనేమీ లేదు. ఎందుకంటే మా మధ్య పగ .. ప్రతీకారాలు వంటివి ఏమీ లేవు” అంటూ చాలా మేచ్యూర్డ్ గా స్పందించాడు.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్