Vaishnav Tej: వైష్ణవ్ విషయంలో క్రిష్ తప్పు చేశాడా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమాతో హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు సానాకు కూడా మంచి పేరు వచ్చింది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుందని తెలిసిన సమయంలో వైష్ణవ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కొండపొలం సినిమాతో వైష్ణవ్ తొలి సినిమాను మించిన హిట్ సాధిస్తాడని వైష్ణవ్ ఫ్యాన్స్ భావించారు. అయితే కొండపొలం సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నమైన ఫలితాన్ని అందుకోవడం గమనార్హం.

ఈ సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని సమాచారం. 8 కోట్ల రూపాయల టార్గెట్ తో కొండపొలం సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నట్టు తెలుస్తోంది. క్రిష్ ఈ సినిమాను వైష్ణవ్ తో తెరకెక్కించి తప్పు చేశాడని వైష్ణవ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి ఇమేజ్ లేని నటుడితో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొండపొలం రిజల్ట్ వైష్ణవ్ తర్వాత సినిమాలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.

వైష్ణవ్ మూడో సినిమా గిరీశయ్య డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో వైష్ణవ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. వైష్ణవ్ కథల ఎంపికలో మారాలని కమర్షియల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది వైష్ణవ్ మూడో సినిమా రిలీజ్ కానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus