ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తుంటారు. పదవిలోకి రాగానే వాటిని పట్టించుకోరు. కానీ ఇచ్చిన హామీల కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడు ఉంటే.. బాగుంటుంది కదూ. అటువంటి ముఖ్యమంత్రినే కొరటాల శివ వెండి తెరపై సృష్టించారు. మహేష్ బాబు ని సీఎం భరత్ రామ్ గా చూపించారు. క్లాస్ సీఎం గా, మాటమీద నిలబడే జెంటిల్ మ్యాన్ గా మహేష్ అదరగొట్టారు. డీవీవీ దానయ్య నిర్మించిన భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం (ఏప్రిల్ 20 )న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నిచోట్లా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 125 గ్రాస్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర బృందం కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కథని దేశ ప్రజలందరూ చూడాలని సంకల్పించింది.
ఇతర భాషలవారు కూడా తప్పకుండా ఆదరిస్తారని భావిస్తోంది. అందుకే మొదటగా హిందీ భాషలో రిలీజ్ చేయాలనీ చూస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ విషయంపై కొరటాల స్పందిస్తూ.. “భరత్ అనే నేను కథ ఒక ప్రాంతానికి సంబందించినది మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కథకి కనెక్ట్ అవుతారు. అందుకే ఈ సినిమాని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు. త్వరలోనే రిలీజ్ అయ్యేలా చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఇక ఈ సినిమా విజయోత్సవాన్ని ఈనెల 27 న తిరుపతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.