Koratala Siva: ఎన్టీఆర్‌ నెక్స్ట్‌ సినిమాపై ఆశలు అంచనాలు ఉఫ్‌!

  • April 22, 2022 / 06:56 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్న తారక్‌ తర్వాతి సినిమాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది. కొరటాల శివ సినిమా ఎలా ఉండబోతోంది, కథ ఏంటి, కాన్సెప్ట్‌ ఏంటి, పాన్‌ ఇండియా సినిమాయేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి జోరు కొనసాగాలంటే మళ్లీ పాన్‌ ఇండియా సినిమానే అవ్వాలి అని అనుకున్నారు. అయితే కొరటాల శివ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు అని చెప్పొచ్చు.

Click Here To Watch NOW

‘ఆచార్య’ ప్రచారంలో బిజీగా ఉన్న దర్శకుడు కొరటాల శివను పాన్‌ ఇండియా సినిమాల గురించి అడిగితే… ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. పాన్‌ ఇండియా అనే పదం ఎందుకో నాకు నచ్చదు అని నర్మగర్భంగా మాట్లాడారు కొరటాల శివ. అయినా మన దేశంలో ఎప్పుడూ ఇలాంటి సినిమాలే వచ్చాయి. కాకపోతే ఒకప్పుడు ఒక భాషలో సినిమా బాగా ఆడిందంటే దాని హక్కులు కొనుక్కునేవారు. ఆ కథని వేరే నటులతో వేరే భాషలో తీసేవాళ్లు. అలా మన కథలు అలా పొరుగు భాషల్లోకి వెళ్లేవి అని చెప్పారు కొరటాల.

ఏ భాషలోనైనా, ఏ ఇండస్ట్రీలో అయినా అందరం చూసేవి ఆ కథల్నే. కాకపోతే ఎక్కడ తీసినా ఆ సినిమానే అన్ని భాషల్లోనూ చూసే వాతావరణం, మార్కెట్‌ సౌలభ్యం ఇటీవల కాలంలో ఏర్పడింది. అయితే దర్శకుడిగా మన కథలు ఇప్పుడు అందరికీ నచ్చుతున్నాయనే సంతోషం చాలా ఉంది. మంచి కథలు రాసేవాళ్లు, వాటిని అద్భుతంగా సినిమాగా మలిచేవాళ్లు తెలుగులో ఉన్నారని చాటుతున్నాం. అలాగే మన సినిమా మరో స్థాయికి వెళ్లడం అందరికీ సంతోషాన్నిచ్చే విషయమే అని చెప్పారు కొరటాల.

మరి ఎన్టీఆర్‌ కోసం రాసిన కథ పాన్‌ ఇండియా సినిమానా అని అడిగితే… మంచి కథే రాశా, ఎక్కువ మంది చూడాలనే రాశాను అని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఓ కథ, పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసమైతే మరో కథ ఉండదు అని చెప్పారు. దీంతో తారక్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా మరోసారి చూద్దామన్న అభిమానుల కోరిక.. కోరికగానే మిగిలిపోతుందేమో మరి. అయితే ఇక్కడ కొరటాల మిస్‌ అయిన పాయింట్‌ ఏంటంటే..

కథ ఎలాంటిది రాసినా, పాన్‌ ఇండియా సినిమా అవ్వాలంటే.. దేశవ్యాప్తంగా విడుదల చేయాలి. దాని కోసం ముందస్తు ప్రిపరేషన్‌ కావాలి. కొరటాల మాటలు వింటుంటే… ఆ వాయిస్‌, టోన్‌ ఎక్కడా వినిపించలేదు. సో వెయిట్‌ అండ్‌ సీ అనే మాట మాత్రమే చెప్పగలం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus