Jr NTR: ఎన్టీఆర్‌ 30 కోసం హాలీవుడ్‌ దిగ్గజాలు.. ప్లాన్‌ అర్థమవుతోందా ఫ్యాన్స్‌!

ప్రపంచస్థాయి సినిమాలు తీయాలంటే.. ఆ సినిమాల కోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు పని చేయాలా? ఏమో గత కొన్నేళ్లుగా మనవాళ్లు ఇదే చేస్తుంటారు. నటీనటులు మన దగ్గర నుండి, టెక్నీషియన్లు విదేశాల నుండి వస్తుంటారు. అయితే లాజిక్‌ సరిగ్గా వర్కవుట్ కాకపోతే.. లాభం మాట అటుంచితే, నష్టం భారీగా ఉంటుంది. గతంలో కొన్ని సినిమాలు ఇలా ఇబ్బంది పడ్డాయి. మరీ ప్రారంభంలోనే అంటున్నాం అని కాకపోతే.. గతంలో జరిగిన అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాల్సి వస్తోంది.

ఎన్టీఆర్‌ (NTR) 30వ సినిమా కోసం ఇటీవల ముహూర్తం జరిగింది. ఆ వెంటనే సినిమా షూటింగ్‌ కూడా మొదలుపెట్టేశారు. భారీ ఎత్తున ఫేక్‌ బ్లడ్‌, ఆయుధాలు, మసి.. ఇలా ఓ రాక్షస వాతావరణం సృష్టించి సినిమా తీస్తున్నారు. ఇదంతా మాస్‌ యాంగిల్‌ అనుకుంటే, ఈ సినిమా కోసం విదేశాల నుండి టెక్నీషియన్లు పిలిపించి పని చేస్తున్నారు. సినిమాకు ఏది అవసరం అనే విషయంలో టీమ్‌కి స్పష్టత ఉంటుంది. అయితే ఆ అవసరం అవసరానికి మించి అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని జాగ్రత్త చెప్పాల్సి వస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కానీ, సౌత్‌లో కానీ ఏదైనా పాన్‌ ఇండియా సినిమా తీయాలంటే కొన్ని సినిమాలు, దర్శకుల పేర్లు చర్చకు వస్తాయి. రాజమౌళి, సుకుమార్‌, ప్రశాంత్‌ నీల్‌ ఆ దర్శకులు అయితే.. ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ ఆ సినిమాలు. ఆ స్థాయిలో ఉంటేనే పాన్‌ ఇండియా సినిమా, పాన్‌ ఇండియా హీరోయిజం అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో విదేశీ టీమ్‌ల అవసరమూ పెరిగింది. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ కూడా అదే పని చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కొత్త సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణులు వరుస కడుతున్నారు.

VFX విషయంలో సూపర్ వైజర్‌గా హాలీవుడ్ టెక్నిషియన్ బ్రాడ్ మిన్నిచ్‌ను రప్పించి పనులు మొదలుపెట్టారు. యాక్షన్ సీన్స్ ఫుల్లుగా ఉండే ఈ సినిమాలో… గ్రాఫిక్ వర్క్ కోసం ఆయన వచ్చాడు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా కెన్నీ బేట్స్‌ను ఇటీవల టీమ్‌లోకి తీసుకున్నారు. వీళ్లంతా సినిమాల కోసం భారీగా వసూలు చేసేవాళ్లే. ‘ఆచార్య’ విషయంలో ఇలాంటి ఖర్చు ఇబ్బందులు ఎదుర్కొన్న కొరటాల.. ఈ సారి జాగ్రత్త పడితే బెటర్‌ అని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus