కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అంటే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని అందరూ భావిస్తారు. కొరటాల శివ సినిమాలలో ఇచ్చే సందేశాల వల్లే ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆయనకు భారీస్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఎన్టీఆర్ తో తెరకెక్కించే తర్వాత సినిమాలో మాత్రం మెసేజ్ ఉండదని ఆ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదని కొరటాల శివ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఎన్టీఆర్ సినిమాపై షూటింగ్ కు ముందే కొరటాల శివ అంచనాలను పెంచేశారు.
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తామని తారక్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇస్తామని కొరటాల శివ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా అద్భుతమైన పాత్రను డిజైన్ చేశానని కొరటాల శివ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని కొరటాల శివ పరోక్షంగా వెల్లడించారు.
తారక్ లో ఇప్పటివరకు చూడని యాంగిల్ ను ఈ సినిమా ద్వారా కొరటాల శివ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతుండగా మే నెల 20వ తేదీన ఈ విషయాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.
ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పరిమితమని చరణ్ రోల్ సెకండాఫ్ అంతటా ఉంటుందని సమాచారం అందుతోంది. మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెమ్యునరేషన్లు కాకుండా ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని బోగట్టా. ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ వీకెండ్ లో ఈ సినిమా అద్భుతాలు చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.