మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడు.. అంటూ ప్రచారం జరిగింది. ఇందుకు గాను మహేష్ 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేసాడని కూడా టాక్ నడిచింది. నిజానికి చరణ్ చెయ్యాల్సిన పాత్ర మహేష్ తో అనుకున్నారు అని ఆ ప్రచారం మొదలైంది. తరువాత ఈ వార్తల పై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ఉండే కీలక పాత్రని రాంచరణే చేస్తున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక మెగాస్టార్ కూడా ట్విట్టర్ లో మహేష్ .. ‘ ‘ఆచార్య’ లో నటిస్తున్నాడు అంటూ వార్తలు ఎలా వచ్చాయో తెలీదు. మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోను’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే అసలు మహేష్ టాపిక్ ఎలా వైరల్ అయ్యింది అనే విషయం పై తాజాగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ…” ‘ఆచార్య’ లో ”ఓ బాధ్యతగల యువకుడి పాత్ర కోసం చరణ్ ని అనుకుంటున్నాను అని చెప్పగా చిరంజీవి గారు ఓ.కే బాగుంటుంది అన్నారు.
అదే విషయాన్ని చరణ్ కి చెప్పగా ఆయన కూడా ఓకే చెప్పాడు. ఐతే ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో చరణ్ డేట్స్ విషయంలో నాకు టెన్షన్ మొదలైంది.ఆ టైం లో మహేష్ తో మాట్లాడాను.ఆయన సినిమా విడుదల ఎప్పుడని అడుగగా… ఆ విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పాను. దానికి మహేష్ ‘నేనున్నాను.. మీరు టెన్షన్ పడకండి’ అన్నారు. ఆయన అలా అనడంతో నేను షాక్ అయ్యాను. అంత పెద్ద హీరో అలా స్పందించడంతో నేను ఆ విషయాన్ని కొందరితో పంచుకున్నాను. అది కాస్తా మహేష్ ‘ఆచార్య’లో నటిస్తున్నాడంటూ వైరల్ చేసేసారు” అంటూ కొరటాల క్లారిటీ ఇచ్చారు.