కొరటాల శివ (Koratala Siva) .. ‘మిర్చి’ (Mirchi) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలో అతను సమకూర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు రిపీట్స్ లో ఆ సినిమా చూసేలా చేశాయి. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ (Srimanthudu) చూశాక కొరటాల పై గౌరవం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఆ సినిమాలో మంచి మెసేజ్ ను కూడా చక్కగా డీల్ చేశాడు. ఆ తర్వాత చేసిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమా విషయంలో తన ఎథిక్స్ ను మర్చిపోలేదు కొరటాల.
ముఖ్యంగా హీరోయిన్స్ ను కూడా తెరపై చక్కగా చూపించేవాడు. వాళ్ళతో మితిమీరిన గ్లామర్ షో వంటివి చేయించింది లేదు. కానీ ‘ఆచార్య’ (Acharya) నుండి బ్యాలెన్స్ తప్పాడు. ఆ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) , రెజీనా (Regina) అందాలపైనే కొరటాల ఆధారపడ్డాడు. బహుశా హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల.. అలా జరిగిందేమో అని కొరటాలని ఇష్టపడేవారు సర్ది చెప్పుకున్నారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడం వల్ల పూర్తిగా అలాంటి తప్పుల్ని మరచిపోవాలని వారు అనుకున్నారు. కానీ ‘దేవర’ (Devara) విషయంలో కూడా జాన్వీ గ్లామర్ పైనే ఆధారపడ్డాడు కొరటాల.
ఎందుకో అతను.. తన సినిమాల్లో ఫాలో అయ్యే ఎథిక్స్ ను మర్చిపోయాడేమో అనిపిస్తుంది. శ్రీదేవి (Sridevi) కూతుర్ని టాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు అంటే.. ఆమె పెర్ఫార్మన్స్ హైలెట్ అయ్యేలా కొరటాల చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ‘చుట్టమల్లె’ సాంగ్లో విజువల్స్ చూసినప్పుడు అందరికీ కొరటాల పై డౌట్ వచ్చింది.తాజాగా రిలీజ్ అయిన ‘దావూదీ’ సాంగ్ చూశాక.. ‘కొరటాల ఎందుకు ఇలా బ్యాలెన్స్ తప్పాడు?’ అని అంతా అనుమాన పడేలా చేశాడు అని చెప్పాలి.
‘హీరోయిన్ జాన్వీ గ్లామర్ (Janhvi Kapoor) పై.. ముఖ్యంగా ఆమె బొడ్డు పై కెమెరా పెడితే తప్ప మాస్ ఆడియన్స్ ను రంజింపచేయలేము అనే ఆలోచనకి కొరటాల దిగజారిపోయాడా?’ అనే డౌట్.. ఈ సాంగ్ చూసిన తర్వాత ఎవ్వరికైనా కలుగుతుంది. పోనీ అనిరుధ్ (Anirudh Ravichander) కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఏమైనా ఆకట్టుకుందా అంటే ‘అరబిక్ కుత్తు’ కి సెకండ్ వెర్షన్లా ఉంది తప్ప.. వెంటనే ఎక్కేలా అయితే లేదు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ‘కొరటాల (Koratala Siva).. కేవలం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తోనే కంఫర్ట్ గా ఫీలవుతాడు’ అని మరోసారి ప్రూవ్ అయినట్టేనేమో..?