తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇలా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈయన వరుసగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతాగ్యారేజ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.
ఇలా కొరటాల అంటేనే అపజయం తెలియదు అనేలా ఈయన పేరు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆచార్య సినిమా ద్వారా కొరటాల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది.
ఇలా ఈ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో పెద్దఎత్తున సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. దీంతో సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇక మెగాస్టార్ సినిమా అంటేనే ఎన్నో అంచనాలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసి తీవ్రస్థాయిలో నష్టపోయారు.ఈ క్రమంలోనే ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు తమను ఆదుకోవాలని వేడుకున్నారు అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి రామ్ చరణ్ ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా ఈ సినిమా కోసం ఏకంగా పాతిక కోట్ల రూపాయలను ఈ సినిమా కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇలా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో కొరటాల తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానుల లో కూడా కాస్త ఆందోళన మొదలైంది.