మిర్చి సినిమా నుంచి ఆచార్య సినిమా వరకు కొరటాల శివ ప్రతి సినిమాలో అంతర్లీనంగా మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాల విషయంలో ఇది ప్లస్ అయినా ఆచార్య సినిమాకు మాత్రం మైనస్ అయింది. అదే సమయంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించి విజయాలను అందుకోవడం సులువైన విషయం కాదు. అందువల్లే తారక్ మూవీలో మెసేజ్ లేకుండా ఉండే విధంగా కొరటాల శివ జాగ్రత్త పడుతున్నారు.
ప్రస్తుతం మాస్ సినిమాలకు, కమర్షియల్ ఎంటర్టైనర్లకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాలో కామెడీ సన్నివేశాలను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ కారణాల వల్లే తారక్ సినిమా స్క్రిప్ట్ ను మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కొరటల శివ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆచార్య సినిమా విషయంలో ఎదురైన అన్ని విమర్శలకు ఎన్టీఆర్ సినిమా ద్వారా గట్టిగా సమాధానం ఇవ్వాలని కొరటాల శివ భావిస్తున్నారు.
ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవాలని కొరటాల శివ అనుకుంటున్నారు. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఈ సినిమా ఎఫెక్ట్ కొరటాల శివ కెరీర్ పై పడలేదు. కొరటాల శివ త్వరలో ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ఆలస్యమైనా పరవాలేదని ఈ సినిమాతో తారక్ కు సక్సెస్ దక్కితే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!