ప్రజల్లో చైతన్యం కలిగించే అత్యంత శక్తివంతమైన మీడియాల్లో సినిమా ఒకటి. రెండున్నర గంటల చిత్రంతో ఎన్నో కోట్లమందికి మంచి సందేశాన్ని అందించవచ్చు. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల శివకి (Koratala Siva) మొదటి నుంచి అలవాటు. పగ ప్రతీకారాలు వీడాలని మిర్చి సినిమాలో చెబితే. పర్వావరణాన్ని కాపాడుకోవాలని జనతా గ్యారేజ్ లో వివరించారు.ఇక శ్రీమంతుడు సినిమాలో అయితే జన్మభూమికి మేలు చేయమని సూచించారు. ఆ శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలోనూ సందేశమివ్వడానికి రెడీ అయ్యారు. సినిమా కంటే ముందే “భరత్ విజన్ పేరిట” రిలీజ్ చేసిన వీడియోలో ఎన్నికల ముందు మాట ఇచ్చి తర్వాత తప్పే వారిపై గట్టిగా పంచ్ వేశారు. “చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది.
ఒకసారి PROMISE చేసి ఆ మాట తప్పితే U R NOT CALLED A MAN అని ఎప్పటికి ఆ మాట తప్పులేదు.. మరిచిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సి రోజు ఒకటి వచ్చింది. పెద్దది కాదు. కష్టమైనది కూడా. కానీ ఎంత కష్టమైన ఆ మాట కూడా తప్పలేదు”Because i Am a Man” అంటూ భరత్ క్యారక్టర్ గురించి వివరించారు. నాయకుడు ఎలా ఉండాలో కూడా చెప్పారు. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ కొరటాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి మాటతప్పిన మోడీని విమర్శించారు. “తన మాటను నిలబెట్టుకుని మగాడు అనిపించుకోవాలి మోడి. తెలుగు రాష్ట్రాలు భారత దేశంలో భాగమే అని ఆయన మర్చిపోయారా?” అంటూ ట్వీట్ చేసి నెటిజనులకు షాకిచ్చారు. కొరటాల ట్వీట్ సినీ జనాల్లోనే కాదు. రాజకీయనాయకుల్లోను చర్చనీయాంశమైంది