ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1978లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని ప్రాణం ఖరీదు సినిమాలో తాను చిన్న వేషం వేశానని కోట శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణగారి సినిమాల్లో తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. బాలకృష్ణ రాజమండ్రి షూటింగ్ లో ఒకసారి తగిలారని ఆయన ఏదో సినిమా షూటింగ్ పనిపై వస్తే తాను జంధ్యాల మూవీ షూటింగ్ కోసం రాజమండ్రికి వచ్చానని కోట శ్రీనివాసరావు తెలిపారు.
పొద్దున్నే లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నానని అటువైపు నుంచి అదే సమయంలో బాలకృష్ణ వస్తున్నారని తాను గౌరవంగా బాలకృష్ణకు నమస్కారం చెప్పగా బాలకృష్ణ కాండ్రించి మొహాన ఉమ్మేశారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని కోట శ్రీనివాసరావు తెలిపారు. తాను ఒక సినిమాలో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ వేసిన వేషం బాలయ్యకు నచ్చలేదని అందుకే అలా ప్రవర్తించారని కోట శ్రీనివాసరావు అన్నారు.
ఎన్టీఆర్ సీఎం అయిన కొత్తలో మండలాధీశుడు అనే సినిమా చేశానని అందులో రామారావుగారి వేషం వేయడంతో ఆ పాత్ర వివాదాస్పదమైందని కోట శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను కొట్టారని మేకర్స్ చెప్పడం వల్లే తాను ఆ పాత్ర వేశానని కోట శ్రీనివాసరావు తెలిపారు. ఆ పాత్ర చేసినందుకు తాను బాధ పడటం లేదని నాన్నను తిడితే ఎవరికైనా కోపం వస్తుందని బాలయ్యకు కూడా అదే విధంగా కోపం వచ్చిందని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!