ప్రముఖ కమెడియన్, నటుడు అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో బాలనటుడిగా నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత అలీకి వరుసగా బాలనటుడిగా సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. సీతాకోకచిలుక అలీకి బాలనటుడిగా ఊహించని స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇప్పటివరకు అలీ ఏకంగా 1100కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం. గతంతో పోలిస్తే అలీకి సినిమా ఆఫర్లు తగ్గగా టీవీ షోల ద్వారా అలీ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు ఒక సినిమాలో సీనియర్ ఆర్టిస్టును తీసుకున్నారని ఆ తర్వాత ఆ ఆర్టిస్టుతో సమస్య రావడంతో కో డైరెక్టర్లు అలీని ఆ పాత్రకు తీసుకోవాలని రాఘవేంద్ర రావుకు సూచించారని కోట శ్రీనివారావు వెల్లడించారు.
అలీని సంప్రదిస్తే నాకు పెళ్లి అని షూటింగ్ కు రావడానికి కుదరదని చెప్పారని రాఘవేంద్ర రావు మాత్రం కో డైరెక్టర్లతో అవన్నీ నేను చూసుకుంటానని అలీని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి ఫ్యామిలీతో హైదరాబాద్ కు రావాలని చెప్పాలని సూచనలు చేశారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. అలీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్ లో సీన్లు చేశాడని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాఘవేంద్ర రావు మంచి హోటల్ లో అలీకి ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేశాడని ఆయన చెప్పుకొచ్చారు.
రాఘవేంద్రరావు అవతలి వ్యక్తుల మంచీచెడుల గురించి తెలుసుకుంటాడని అందువల్లే ఆయన డైరెక్షన్ లో నటించడానికి నటీనటులు ఆసక్తి చూపుతారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి రాఘవేంద్రరావు డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు.