మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద తన పవర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సినిమా అనేక ఇబ్బందులను దాటుకుంటూ విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన మొదటి నుంచి కూడా కలెక్షన్స్ డోస్ కొంచెం కూడా తగ్గడం లేదు. పెట్టిన పెట్టుబడికి లాభాలు ఎప్పుడో వచ్చాయి. ప్రస్తుతం క్రాక్ ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఇక నుంచి ఎంత వచ్చినా కూడా లాభాలే. అయితే సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందని మొదట్లో పెద్దగా ఎవరు ఊహించలేదు.
అందుకే దిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ వంటి వాటికి ఆఫర్స్ కూడా అనుకున్నంత రేంజ్ లో రాలేదు. కానీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని కొందరు మాత్రమే నమ్మారు. ఇక ఆహా యాప్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ క్రాక్ సినిమాను ఆహా యాప్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయించాలని మొదట్లో గట్టిగానే చర్చలు జరిపారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక సినిమా హక్కులను 8.20కోట్లకు కొన్నట్లు సమాచారం.
జనవరి ఎండింగ్ లో లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్ అనంతరం ఆహా యాప్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి అప్పుడు సినిమాకు ఇంకా ఏ స్థాయిలో రరెస్పాన్స్ వస్తుందో చూడాలి. గోపిచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!