‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ ‘పేట’ ‘వినయ విధేయ రామా’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలతో సంక్రాంతికి బాక్సాఫీస్ వేడెక్కేటట్టే ఉంది. అయితే ఈ నాలుగు చిత్రాల్లోనూ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేత్యేకమనే చెప్పాలి. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో రానా,సుమంత్,కళ్యాణ్ రామ్, విద్యాబాలన్ , తమన్నా,రకుల్,హన్సిక, ప్రణీత, వంటి ఎంతో మంది నటి నటులు, నటిస్తుండడం అన్నింటికీ మించి ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తుండం తో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తాజా సమాచారం. మరి ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కోసం క్రిష్ దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ చిత్రం కోసం క్రిష్ బాలీవుడ్ లో కంగనాతో తెరకెక్కిస్తున్న ‘మణికర్ణిక’ చిత్రాన్ని కూడా వదులుకుని వచ్చినందుకు… ఈ చిత్రం మొదలనప్పుడే నందమూరి బాలకృష్ణ.. క్రిష్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని క్రిష్ చాలా శ్రద్ద తీసుకుని మరీ తెరకెక్కించడంట. ఇప్పటివరకు ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచుకున్నప్పటికీ… కమర్షియల్ డైరెక్టర్ అనే పేరుకి క్రిష్ కొంచెం దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంతో భారీ కలెక్షన్లు రాబట్టి క్రిష్ కమర్షియల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవడం కూడా ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి..!