అపూర్వ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కి మొదట రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు. కానీ ఏమైంది ఏమో తెలియదు కానీ అతను పక్కకు తప్పుకొని ఆ స్థానంలో చిరంతన్ బట్ వచ్చారు. ఈ బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ శాతకర్ణికి మంచి సంగీతాన్ని అందించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విజయానికి పాటలు, నేపధ్య సంగీతం దోహదం చేశాయి. దేవీ ఎందుకు టీమ్ నుంచి బయటికి వెళ్లిపోయారు అనే సందేహం ఇంతకాలం ప్రశ్న గానే మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు డైరక్టర్ తాజాగా సమాధానం ఇచ్చారు.
“దేవీ శ్రీ ప్రసాద్ ని తప్పించడం వెనుక ఉన్న ప్రధాన కారణం సమయం లేకపోవడం. పాటలను కంపోజ్ చేయడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. పైగా అదే సమయంలో నా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. ఆ టైం లో చెన్నై, హైదరాబాద్ తిరగడానికి నాకు వీలు కుదిరేది కాదు. ఇదే విషయాన్నీ దేవీకి చెప్పాను. అతను నా పరిస్థితిని అర్ధం చేసుకొని పక్కకు తప్పుకొని, కొంతమంది మ్యూజిక్ డైరక్టర్స్ పేర్లను కూడా చెప్పారు.” అని క్రిష్ వివరించారు. అయితే చిరంతన్ బట్ ఇచ్చిన సంగీతం తనని పూర్తి సంతృప్తి ఇచ్చిందని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.