ఒకప్పుడు సంక్రాంతి అంటే స్టార్ హీరోల సినిమాలే గుర్తుకొచ్చేవి. లేదా ఎం.ఎస్. రాజు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సినిమాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.ఈసారి ఓ డైరెక్టర్ సంక్రాంతి పండుగని బాగా వాడుకుంటున్నాడు. ఆ పండగ సీజన్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుని సంక్రాంతి డైరెక్టర్ గా పేరొందిన దర్శకుడు మరెవరో కాదు అనిల్ రావిపూడి(Anil Ravipudi).సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి ఆ సినిమాని కొంటున్నారు.
మిగతా సీజన్లతో పోలిస్తే, అనిల్ సినిమా పండక్కి పడితే బిజినెస్ రేట్ ఈజీగా 5 నుంచి 10 శాతం ఎక్కువగా పలుకుతుంది. అంతలా డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకం కలిగించాడు ఈ హిట్ మెషిన్. అనిల్ వర్కింగ్ స్టైల్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆరు నెలలు స్క్రిప్ట్ మీద కూర్చోవడం, మిగతా ఆరు నెలల్లో చకచకా షూటింగ్ పూర్తి చేసి సినిమాను థియేటర్లలోకి తేవడం ఆయన రూటు.అది సెపరేటు.

2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, 2026 సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.మరి 2027 సంక్రాంతి సంగతేంటి? ఈసారి అనిల్ రావిపూడి గురి ఎవరి మీద? అనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ – వెంకటేష్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఖాయమైనట్టే కనిపిస్తోంది.
రీసెంట్‌గా ఓ దర్శకుడు కథ చెప్పడానికి వెంకటేష్ దగ్గరికి వెళ్తే.. ‘2026 జూన్ నుంచి అనిల్ రావిపూడి సినిమా కోసం డేట్స్ ఇచ్చాను, అప్పటివరకూ ఖాళీ లేదు’ అని సున్నితంగా తిరస్కరించారట. దీన్ని బట్టి చూస్తుంటే.. జూన్ నుంచి డిసెంబర్ వరకు నాన్ స్టాప్‌గా షూటింగ్ చేసి, 2027 సంక్రాంతికి వీరిద్దరూ థియేటర్లలో సందడి చేయడం పక్కా అనిపిస్తోంది. ఇది ఎఫ్-2, ఎఫ్-3 తరహాలో మరో సీక్వెలా? లేక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెలా? లేక కొత్త కథా? అనేది తెలియాల్సి ఉంది.
వాస్తవానికి బాలకృష్ణతో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి, అనిల్ అనుకున్న టైమ్ టేబుల్ సెట్ కాకపోవచ్చు. అనిల్ ప్లాన్ ప్రకారం జూన్ నుంచి డిసెంబర్ వరకు బల్క్ డేట్స్ ఇచ్చే హీరో కావాలి. ప్రస్తుతానికి ఆ లిస్టులో విక్టరీ వెంకటేష్ పేరే గట్టిగా వినిపిస్తోంది. సో.. 2027 సంక్రాంతికి అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ లోడింగ్ అన్నమాట.
